- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bombay High Court : సఫారీ సందర్శకులపై హైకోర్ట్ సీరియస్.. కారణం ఇదే
బాంబే హైకోర్ట్(Bombay High Court) సఫారీ(Safary) సందర్శకుల మీద సీరియస్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్ : బాంబే హైకోర్ట్(Bombay High Court) సఫారీ(Safary) సందర్శకుల మీద సీరియస్ అయ్యింది. సందర్శకుల మీద సాక్షాత్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎందుకు మండిపడింది అనుకుంటున్నారా? ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర(Maharashtra)లోని ఉమ్రేడ్-పౌని-కర్హండ్ల(Umred-Pauni-Karhandla) వన్యప్రాణుల అభయారణ్యం(Wildlife Sanctuary)లో సందర్శకులు సఫారి రైడ్ కు వెళ్లారు. కొద్ది దూరం వెళ్ళగానే ఓ ఆడపులి నాలుగు కూనలతో రోడ్డుపై వెళుతూ కనిపించింది. వెంటనే సఫారీ వాహనాలన్నీ పిల్లలతో ఉన్న పులిని చుట్టుముట్టాయి. అన్ని వాహనాలు, సందర్శకులను చూసి భయపడి పోయింది. పిల్లలతో సహ ఆందోళనగా పక్కన పొడల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ ఘటనను సందర్శకుల్లో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట్లో వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై స్పందించిన కోర్ట్.. సఫారీ నిర్వహకులపై, సందర్శకులపై, అభయారణ్యం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి తమకు నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.






