అది మాకు నచ్చదు.. కేరళ స్టోరీ-2 వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

కేరళ స్టోరీ 2 సినిమా సెన్సార్ స‌ర్టిఫికెట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై జస్టిస్ బెచు కురియన్ థామస్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది.

అది మాకు నచ్చదు.. కేరళ స్టోరీ-2 వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కేర‌ళ స్టోరీ 2 సినిమా విడుద‌ల వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను కేరళకు వ్యతిరేకంగా చిత్రించారని, విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఇక సినిమా సెన్సార్ స‌ర్టిఫికెట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై జస్టిస్ బెచు కురియన్ థామస్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులు సాధారణంగా కళాత్మక వ్యక్తీకరణలో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడవు అని కానీ ప్రజలు లేవనెత్తిన ఆందోళనలను విస్మరించలేమని పేర్కొంది. ఎందుకంటే టైటిల్ లో రాష్ట్రం పేరు ఉపయోగించారని తెలిపింది.

కేరళ ప్రజలు సామరస్యంతో ఉంటారని, కానీ కేరళలో అంతటా ఇది జరుగుతుందని మీరు చిత్రీకరించారని పేర్కొంది. ఈ సినిమా తప్పుడు సూచనలు ఇస్తోందని, ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని వ్యాఖ్యానించింది. ఇక్కడే సెన్సార్ బోర్డ్ పాత్ర పోషిస్తోందని, మీరు దాని గురించి ఆలోచించారా అని సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు జారీ చేసే ముందు సినిమాను చూస్తామని కోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా తాను ఏ సినిమాలోనూ జోక్యం చేసుకోలేదని, కానీ టైటిల్ లో కేరళ పేరు ఉండటం, మతపరమైన ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉండటంతో సినిమా చూసే తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.

Next Story