- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయ్‌లో హై అలర్ట్.. క్షిపణి దాడులు జరగొచ్చని ఎమర్జెన్సీ వార్నింగ్
దుబాయ్‌లో క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజల ఫోన్లకు అత్యవసర సందేశాలు పంపుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియా (Western Asia)లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరగడంతో దుబాయ్ (Dubai) నగరం హై అలర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. నగరంపై క్షిపణి దాడులు (Missile Attacks) జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో యూఏఈ (UAE) ప్రభుత్వం, దుబాయ్ భద్రతా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం దుబాయ్‌లోని నివాసితులు, పర్యాటకుల మొబైల్ ఫోన్లకు పెద్ద శబ్దంతో కూడిన అత్యవసర హెచ్చరిక సందేశాలు (Emergency Alerts) వచ్చాయి. ఈ సందేశం రాగానే ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అధికారులు పంపిన ఈ అలర్ట్‌లో ప్రస్తుతం భద్రతా పరమైన ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు..
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. కిటికీలు, గ్లాస్ డోర్లకు దూరంగా, భవనాల లోపలి భాగంలో ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక ఛానెల్స్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని కోరారు.
మరోవైపు ఇరాన్ నుంచి మిస్సైల్స్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దుబాయ్ తన గగనతల రక్షణ వ్యవస్థలను (Air Defense Systems) సిద్ధం చేసింది. విమానాశ్రయాల వద్ద ప్రధాన కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ లక్షలాది మంది తెలుగు ప్రవాసులు నివసిస్తుండటంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.






