వార్ ఎఫెక్ట్.. 130 గంటలకుపైగా ఇరాన్ ఆఫ్లైన్

by Muthe.Rajitha |   (  Updated:2026-03-06 10:49:52  IST  )

ఇరాన్ - ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఇరాన్ లో 130 గంటలకు పైగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

వార్ ఎఫెక్ట్.. 130 గంటలకుపైగా ఇరాన్ ఆఫ్లైన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య గత ఏడు రోజులుగా యుద్ధం భీకరస్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ కొనసాగుతోంది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' దాడుల అనంతరం, ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన ఈ బ్లాకౌట్ ప్రస్తుతం 130 గంటలు దాటిపోయింది. అంతర్జాతీయ ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ గణాంకాల ప్రకారం.. ఇరాన్ జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీ కేవలం 1% మాత్రమే (Flatlining at 1%) ఉంది. దీనిని నిపుణులు 'డిజిటల్ ఐసోలేషన్' గా వర్ణిస్తున్నారు. అంటే 90 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఇరాన్ దేశం దాదాపుగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది, ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

రెజిమ్-ఇంపోజ్డ్

ఈ బ్లాకౌట్ ఇరాన్ ప్రభుత్వం విధించిన "రెజిమ్-ఇంపోజ్డ్ (Regime-imposed)" షట్‌డౌన్‌గా నిర్ధారణ అయింది. యుద్ధ సమయంలో సమాచారం స్ప్రెడ్ అవకుండా నియంత్రించడానికి, సైబర్ దాడుల తీవ్రతను తగ్గించడానికి, అంతర్గత నిరసనలను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ 'కిల్ స్విచ్' వ్యూహాన్ని అమలు చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ తో యుద్ధంలోనూ ఇరాన్ ఇలాంటి బ్లాకౌట్‌లను విధించింది. అయితే, కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం ప్రభుత్వ ఆదేశాలే కాకుండా, యుద్ధం కారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, అమెరికా సైబర్ దాడులు కూడా ఈ వైఫల్యానికి ఒక కారణం కావచ్చునని అంటున్నారు.

సేవలు బంద్

త 130 గంటలుగా ఇరాన్ ఈ-కామర్స్, బ్యాంకింగ్ రంగాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆన్‌లైన్ లావాదేవీలు జరగకపోవడంతో వ్యాపారాలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో, కేవలం ప్రభుత్వ మద్దతు ఉన్న ఖాతాలు, మీడియా మాత్రమే సమాచారాన్ని నియంత్రిస్తున్నాయి. దీనివల్ల వాస్తవ పరిస్థితులు బయట ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి. ప్రజలు తమ బంధువులతో మాట్లాడటానికి వీలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఫోన్ కాల్స్ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్నప్పటికీ, సెక్యూర్ కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఇరాన్ లో ఒకవైపు ఇంటర్నెట్ బ్లాకౌట్ కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ హ్యాకర్లు ఇరాన్ మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు చేసినట్టు సమాచారం. మొత్తానికి ఇప్పుడు ఇరాన్ ఒక మూసివేసిన గదిలా మారిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దుబాయ్‌లో హై అలర్ట్.. క్షిపణి దాడులు జరగొచ్చని ఎమర్జెన్సీ వార్నింగ్

Next Story