High Alert: పహెల్గాం తర్వాత టార్గెట్ ఢిల్లీ.. దేశరాజధానిలో హై అలర్ట్

by Prasad Jukanti |

ఉగ్రదాడి జరగవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.

High Alert: పహెల్గాం తర్వాత టార్గెట్ ఢిల్లీ.. దేశరాజధానిలో హై అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత దేశంలో మరికొన్ని చోట్ల టెర్రరిస్టులు రెచ్చిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని (Delhi) ఉగ్రవాదులు టార్గెట్ చేయవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధానిలో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. నగరం అంతటా పోలీసులు భద్రతను పెంచారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలల్లో భద్రతను మరింత పెంచారు. సరిహద్దు చెక్‌పోస్టులపై దృష్టి సారించారు. తనిఖీలు, నిఘా ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం వంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికల ఫోకస్ పెంచారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులతో ఢిల్లీ పోలీసులు చర్చలు జరిపారు.

Next Story