బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనాపై నేడే తీర్పు.. దేశంలో హై అలర్ట్

by Ajay Maddhiboyina |

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హ‌సీనా కేసుకు సంబంధించి నేడే తీర్పు వెలుబ‌డ‌నుంది. మాన‌వ‌త్వానికి వ్య‌తిరేకంగా నేరాల‌కు పాల్ప‌డ్డార‌న్న అభియోగాల‌తో హ‌సీనాపై కేసు న‌మోదు కాగా ప్రాసిక్యూట‌ర్లు ఆమెకు ఉరిశిక్ష విధించాల‌ని కోరారు.

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనాపై నేడే తీర్పు.. దేశంలో హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హ‌సీనా కేసుకు సంబంధించి నేడే తీర్పు వెలుబ‌డ‌నుంది. మాన‌వ‌త్వానికి వ్య‌తిరేకంగా నేరాల‌కు పాల్ప‌డ్డార‌న్న అభియోగాల‌తో హ‌సీనాపై కేసు న‌మోదు కాగా ప్రాసిక్యూట‌ర్లు ఆమెకు ఉరిశిక్ష విధించాల‌ని కోరారు. దీంతో దాదాపు హ‌సీనాకు ఉరిశిక్ష వేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు కేసులో స‌హ నిందితుడుగా ఉన్న మాజీ హోంమంత్రి అస‌దుజ్జ‌మాన్ క‌మాల్ కు సైతం శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. అయితే వీరికి సంబంధించిన తీర్పు వెలుబ‌డ‌నున్న స‌మ‌యంలో బంగ్లాదేశ్ లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

రెండు మూడు రోజులుగా డాకాలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అంతే కాకుండా దేశంలో పేలుళ్లు, ద‌హ‌నాల‌తో అశాంతి వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో దేశ‌వ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఫేస్ బుక్ ద్వారా షేక్ హ‌సీనా వీడియో సందేశం ఇచ్చారు. అందులో భావోద్వేగంగా... భ‌య‌ప‌డానికి ఏమీ లేదు, నేను బ‌తికే ఉన్నాను, బ‌తికే ఉంటానని అన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు మ‌త్ద‌తు ఇస్తాన‌ని తెలిపారు. తీర్పుకు ముందు హ‌సీనా వీడియో తెగ వైర‌ల్ అవ్వ‌డంతో మ‌ద్ద‌తుదారులు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వ‌డంతో హై అల‌ర్ట్ ప్ర‌టించారు. ఈ క్ర‌మంలో హ‌సీనా కేసుపై అంత‌ర్జాతీయ నేరాల ట్రిబ్యున‌ల్ ఎలాంటి తీర్పు ఇస్తుంది. నేడు దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయి అన్న‌ది ఉత్కంఠగా మారింది.

Next Story