హిడ్మా ఎన్‌కౌంటర్.. బస్తర్ అడవుల్లో మైనింగ్ షురూ! ఆదివాసీ మహిళ వీడియో వైరల్

by Ramesh Naini |

ఈనెల 18వ తేదీన ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే.

హిడ్మా ఎన్‌కౌంటర్.. బస్తర్ అడవుల్లో మైనింగ్ షురూ! ఆదివాసీ మహిళ వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 18వ తేదీన ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత బస్తర్ అడవుల్లో మైనింగ్ షురూ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఆదివాసీ మహిళ సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ‘మీకు నా పక్కన మైనింగ్ జరుగుతుంది. మీకు తెలుసుగా అడవి పచ్చగా ఉంటుంది. కానీ మైనింగ్ మొదలు అయ్యాక మొత్తం ఎర్రగా అయింది. మా బస్తర్‌లో ఏమి జరుగుతోందో అస్సలు తెలియడం లేదు. మా పిల్లలకు అడవి లేకుండా చేస్తున్నారు. మేము ఇప్పటి దాకా మా అడవుల కోసం చేసిన పోరాటం వృథా నా..? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మా జల్, జంగల్‌పై ఆదిపత్యం.’ అని స్థానిక ఆదివాసీ మహిళ భావోద్వేగం వ్యక్తం చేశారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా @storyoftribes_araku అనే యూజర్ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివాసీ ప్రాంతాలను అదాని, అంబానికి అమ్మే కుట్ర జరుగుతోందని ఈ సందర్భంగా నెటిజన్‌లు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మాది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని పౌర హక్కుల సంఘం, మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన మావోయిస్టులను పట్టుకొని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామని చెప్పి, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. వీడియో లింక్..

Next Story