- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hezbollah : హిజ్బుల్లా అగ్రనేత హమాదీ హతం.. లెబనాల్‌లోని తన ఇంటి వద్దే కాల్చివేత
హిజ్బుల్లా అగ్రనేత హమాదీ హత్యకు గురయ్యారు. లెబనాన్‌లోని తన ఇంటి వద్దే ఉండగా రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు కాల్చి వేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుల్లా (Hezbollah) అగ్రనేత షేక్ ముహమ్మద్ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hammadi) హత్యకు గురయ్యారు. తూర్పు లెబనాన్‌లోని తన ఇంటి వద్దే ఉండగా రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు ఆయనను కాల్చి వేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన హమాదీని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంచి మరణించాడు. కుటుంబ కలహాలతోనే నిందితులు ఈ దాడికి పాల్పడినట్టు పలు కథనాలు వెల్లడించగా, ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ (Israel) హస్తం ఉండొచ్చని మరి కొన్ని కథనాలు పేర్కొన్నాయి. లెబనీస్ భద్రతా దళాలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. అయితే హమాదీ మృతిపై హిజ్బుల్లా అధికారికంగా స్పందించలేదు.
కాగా, హమాదీని అమెరికా ఫెడరల్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చారు.1985లో అనేక మంది అమెరికన్లతో సహా 153 మంది ప్రయాణీకులతో ఏథెన్స్ నుంచి రోమ్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్ 847 అనే పశ్చిమ జర్మన్ విమానాన్ని హైజాక్ చేశాడు. ఈ సమయంలో ఒక అమెరికన్ జాతీయుడు చిత్రహింసలకు గురై మరణించగా అందులో హమాదీ హస్తం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనను ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణ వేళ హమాదీ హత్య జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.






