- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీని కలిసిన హీరో నాగార్జున.. కారణం ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)ని టాలీవుడ్ హీరో(Tollywood) నాగార్జున(Hero Nagarjuna) కుటుంబ సమేతంగా ఢిల్లీ(Delhi)లో కలిశారు.

దిశ,వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)ని టాలీవుడ్ హీరో(Tollywood) నాగార్జున(Hero Nagarjuna) కుటుంబ సమేతంగా ఢిల్లీ(Delhi)లో కలిశారు. పార్లమెంట్(Parlament)లోని ప్రధాని కార్యలయం(PM Office)లో జరిగిన ఈ భేటీలో నాగార్జున(Akkineni Nagarjuna)తో పాటు అమల(Amala), నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala), నాగసుశీల(Naga Sushila) సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్(Former MP Yarlagadda Lakshmi Prasad) కూడా ఉన్నారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.
భారతీయ సినిమా(Movie)కు నాగేశ్వరరావు చేసిన కృషిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ కొనియాడారు. పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా(Social Media) వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నాగ చైతన్య కూడా మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు పై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని ప్రధాని మోడీ(PM Modi) ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే గతంలో హీరో నాగార్జున పలుమార్లు ప్రధాని మోడీని కలిసినట్లు సమాచారం.






