Bulldozer Action : బుల్డోజర్ యాక్షన్‌పై ‘సుప్రీం’ తీర్పుతో మాకు సంబంధం లేదు : యోగి సర్కారు

by Hajipasha |
Bulldozer Action : బుల్డోజర్ యాక్షన్‌పై ‘సుప్రీం’ తీర్పుతో మాకు సంబంధం లేదు : యోగి సర్కారు
X

దిశ, నేషనల్ బ్యూరో : అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో బుల్డోజర్ చర్యలను(bulldozer action) ఆపి, చట్టబద్ధమైన పద్ధతిని అనుసరించాలంటూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పు‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(UP govt) స్వాగతించింది. అయితే ఆ తీర్పుతో తమ రాష్ట్రానికి సంబంధం లేదని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ‘జమియత్ ఉలెమాయె హింద్ వర్సెస్ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్’ కేసుపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు తాజా తీర్పును ఇచ్చిందని ఆయన తెలిపారు.

‘‘సుపరిపాలన అనేది చట్టబద్ధంగా ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు నేరగాళ్ల భయాన్ని మరింత పెంచేలా ఉంది. దీనివల్ల మాఫియాను, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిని చాలా సులభంగా నియంత్రించొచ్చు’’ అని యూపీ అధికార ప్రతినిధి చెప్పారు. యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వం ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తిని కూల్చలేదు. అక్రమ ఆస్తులపైకి మాత్రమే బుల్డోజర్లు వెళ్లాయి. కోర్టుల తీర్పులకు అనుగుణంగానే కూల్చివేతలు జరిగాయి. ఇందులో మా సొంత నిర్ణయాలు లేవు’’ అని తేల్చి చెప్పారు.

Advertisement

Next Story