- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరెస్ట్ సమీపంలో హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్.. పైలట్‌కు తీవ్ర గాయాలు
నేపాల్ (Nepal)లోని మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) సమీపంలో బుధవారం ఉదయం ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌కు చెందిన హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ (Nepal)లోని మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) సమీపంలో బుధవారం ఉదయం ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌కు చెందిన హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ దుర్ఘటనలో అందులో ఉన్న పైలట్‌కు తీవ్ర గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. అల్టిట్యూడ్ ఎయిర్ హెలికాప్టర్ ప్రయాణికులు లేకుండా లూక్లా (Lukla) నుంచి బయలుదేరి ఖుంబు (Khumbu) ప్రాంతంలోని లోబుచెమ్ (Lobuchem)లో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించే మిషన్‌కు బయలుదేరింది.
సోలుఖుంబు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఓ పోలీసు అధికారి కథనం మేరకు కెప్టెన్ వివేక్ ఖడ్కా (Vivek Khadka) నడిపిన ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో కురిసిన భారీ మంచు కారణంగా జారిపోయిందని తెలిపారు. దీంతో పైలట్‌కు గాయలయ్యాయని, హెలికాప్టర్ రెండు ముక్కలుగా విడిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు పైలట్‌ను చికిత్స నిమిత్తం లూక్లాకు ఎయిర్‌లిఫ్ట్ చేశామని, అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. మంగళ, బుధవారాల్లో భారీ మంచు కారణంగా ముస్తాంగ్, అన్నపూర్ణ, ఎవరెస్ట్ ప్రాంతం సహా పర్వత ప్రాంతాల్లో అనేక మంది ట్రెక్కర్లు చిక్కుకుపోయారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో భారీ మంచు, వర్షాలు కురుస్తాయని హైడ్రాలజీ అండ్ మెటీరాలజీ శాఖ అంచనా వేయడంతో అధికారులు ట్రెక్కర్లు, పర్వతారోహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






