పొలంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి..

by Sujitha Rachapalli |

యూకేలోని ఐల్ ఆఫ్ వైట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్..

పొలంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి..
X

దిశ, వెబ్ డెస్క్ : యూకేలోని ఐల్ ఆఫ్ వైట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్.. శాండోన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. కానీ కొద్ది నిమిషాల్లోనే షాంక్లిన్ రోడ్డు సమీపంలోని పొలంలో కుప్పకూలింది. కాగా హెలికాప్టర్ కిందపడటం చూసిన ప్రత్యక్ష సాక్షి.. ఎయిర్‌బ్యాగ్స్ యాక్టివేట్ అయినట్లు చెప్పాడు. సకాలంలో స్పందించిన హాంప్‌షైర్, ఐల్ ఆఫ్ వైట్ పోలీసులు.. ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్.. ఎయిర్ అంబులెన్స్ వెంటనే స్పందించడంతో గాయాలతో బయటపడిన ఒకరిని హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తోంది.

Next Story