- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెరుగుపడ్డ హీరాబెన్ మోడీ ఆరోగ్యం
by Bhoopathi Nagaiah |
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఒకటి రెండు రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ప్రధాని మోడీ సోదరుడు సోమాభాయ్ మోడీ గురువారం వెల్లడించారు

X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ఒకటి రెండు రోజుల్లో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ప్రధాని మోడీ సోదరుడు సోమాభాయ్ మోడీ గురువారం వెల్లడించారు. 'ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి ఓరల్ డైట్ ప్రారంభించబడింది' అని గుజారత్ సీఎంవో ఆఫీసు నుంచి ఓ ప్రకటన వచ్చింది. కాగా, హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను బుధవారం ఉదయం అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో బుధవారం చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఆమెను సాయంత్రం పరామర్శించారు.
Next Story






