- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. గర్భిణీ ప్రాణాలను కాపాడిన భారత సైన్యం
భారీ హిమపాతం దారులన్నింటినీ మూసివేసిన వేళ.. భారత సైన్యం మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో : భారీ హిమపాతం దారులన్నింటినీ మూసివేసిన వేళ.. భారత సైన్యం మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని తంగ్ధర్ ప్రాంతంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక 26 ఏళ్ల గర్భిణీ స్త్రీని జవాన్లు సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా తంగ్ధర్ పరిసర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో, ప్రసవ వేదనతో ఉన్న ఒక గర్భిణీని ఆసుపత్రికి తరలించడం కుటుంబ సభ్యులకు కష్టమైంది. దీంతో సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భారత సైనికులు, మైనస్ డిగ్రీల చలిని సైతం లెక్కచేయకుండా ఆమెను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.
భూజాలపై మోస్తూ కిలోమీటర్ల మేర నడిచి..
హిమపాతంలో వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో, జవాన్లు ఆమెను స్ట్రెచర్‌పై ఉంచి, అత్యంత ప్రమాదకరమైన మంచుపై భూజాలపై మోస్తూ కిలోమీటర్ల మేర నడిచి సమీపంలోని వైద్య కేంద్రానికి చేర్చారు. సైన్యం వేగంగా స్పందించడం ప్రస్తుతం గర్భిణీ క్షేమంగా ఉన్నట్లు అధికారుల సమాచారం. కాగా, సరిహద్దు గ్రామాల్లో మంచు కారణంగా రాకపోకలు నిలిచినప్పుడల్లా, స్థానికులకు భారత సైన్యమే అండగా నిలుస్తోంది.






