- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain Alert:రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు
గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి.

దిశ,వెబ్‌డెస్క్: గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో శనివారం కేరళను తాకిన రుతుపవనాల ప్రభావంతో ముంబై, పూణె నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఈ రోజు(సోమవారం) మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కరూల్ ఘాట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ క్రమంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉ.10:30 నుంచి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొల్హాపూర్-సింధుదుర్గ్ రహదారిపై ట్రాఫిక్‌జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని రాయగడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.






