దేశ రాజధానిలో భారీ వర్షాలు.. 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-09 02:28:56  IST  )

దేశ రాజధాని ఢిల్లీని వర్షం అతలాకుతలం చేస్తోంది.

దేశ రాజధానిలో భారీ వర్షాలు.. 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని వర్షం అతలాకుతలం చేస్తోంది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు భారీగా వచ్చి చేరి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే అక్కడ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) ప్రకటించింది. అత్యవసరం అయితేనే తప్ప.. ఇళ్ల నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక భారీ వర్షాల కారణంగా ఢిల్లీ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. ఈ పరిణామంతో దాదాపు 100 పైగా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.

Next Story