- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. హైవే క్లోజ్, ఉహించని వరదలు
మేఘాలయలో భారీ వర్షాల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి షిల్లాంగ్-దావ్‌కీ హైవే మూసివేత, ఉగ్రరూపంలో ఉమ్‌న్గోట్ నది!

దిశ, వెబ్ డెస్క్: సూపర్ ఎల్‌నీనో ప్రభావంతో దేశంలో ఓ పక్క ఎండలు దంచికొడుతుంటే.. ఈశాన్య రాష్ట్రం అయిన మేఘాలయ (Meghalaya)లో మాత్రం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కుంభవ్రృష్టి వర్షం (Aquarius rain) కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పు తీవ్రమైంది. ఈ విపత్కర పరిస్థితుల వల్ల రాజధాని షిల్లాంగ్‌ను ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దావ్‌కీ (బంగ్లాదేశ్ సరిహద్దు) తో అనుసంధానించే జాతీయ రహదారి లోని కొంత భాగం కొండచరియలు విరిగిపడి లోయలోకి కుప్పకూలింది. దీంతో ఈ కీలక మార్గంలో రవాణా పూర్తిగా స్తంభించి పోగా, అధికారులు వాహనాల రాకపోకలను నిషేధించారు. పర్యాటకులు, ప్రయాణికులు దావ్‌కీ వెళ్లేందుకు సోహ్రా లేదా జోవై మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా కలెక్టర్ సూచించారు.
మరోవైపు, నిరంతరాయంగా పడుతున్న వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అత్యంత స్వచ్ఛమైన నీటితో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రసిద్ధ ఉమ్‌న్గోట్ నది (దావ్‌కీ నది) ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి తీవ్రమవడంతో నదిపై నిర్మిస్తున్న కొత్త వంతెన వద్ద ఏర్పాటు చేసిన కార్మికుల క్యాంపులు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ ఉంచిన జేసీబీ యంత్రాలు, భారీ నిర్మాణ సామగ్రి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణంలోనైనా అత్యవసర సహాయం కోసం 112 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.






