నాలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

by Malleboina Mahesh |

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక!

నాలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్ నీనో ప్రభావంతో కాస్త నెమ్మదిగా కదిలిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ప్రస్తుతం దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) రాబోయే రోజుల్లో దేశంలోని నాలుగు ప్రముఖ రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy to Very Heavy Rain) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల ప్రభావం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొంకణ్ తీరం, గుజరాత్ పరివాహక ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించింది. ఢిల్లీ వంటి నగరాల్లో భారీ వర్షాల వల్ల ట్రాఫిక్ నిలిచిపోవడం, రోడ్లపై నీరు చేరే (Waterlogging) ప్రమాదం ఉన్నందున మున్సిపల్ సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ బృందాలు సైతం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story