యూపీలో నీట మునిగిన 14 జిల్లాలు.. భారీ వరదలతో ప్రజా జీవితం అస్తవ్యస్తం!

by Phanindra |

యూపీలో భారీ వరదలతో 14 జిల్లాలు నీట మునిగాయి. గంగానదిలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరి లోతట్టు ప్రాంతాలను ముంచేసింది.

యూపీలో నీట మునిగిన 14 జిల్లాలు.. భారీ వరదలతో ప్రజా జీవితం అస్తవ్యస్తం!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని పలు పట్టణాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అయింది. ముఖ్యంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీల్లో ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. వారణాసిలో గంగానది ప్రమాద స్థాయికి చేరి, లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. ప్రయాగ్ రాజ్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో నీట మునిగిన రహదారుల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు ప్రజలు పడవలు ఉపయోగిస్తూ కనిపించారు.

యూపీలో ప్రయాగ్ రాజ్, జలాన్, ఆరియా, హమీర్‌పూర్, ఆగ్రా, మిర్జాపూర్, వారణాసి, కాన్పూర్ దేహాత్, బలియా, బాందా, ఎతావా, ఫతేపూర్, కాన్పూర్ నగర్, చిత్రకూట్ జిల్లాలు వరదల్లో నీటమునిగాయి. హమీర్‌పూర్‌లో నీట మునిగిన ప్రాంతాలను విమానం నుంచి యూపీ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ పరిశీలించారు.

Next Story