భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం.. 250 విమానాల రాకపోకలు ఆలస్యం

by Naga Rani Yarlagadda |

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవ్యాప్తంగా రోడ్లపైకి నీరు చేరింది.

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం.. 250 విమానాల రాకపోకలు ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవ్యాప్తంగా రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ముంబై, శివారు ప్రాంతాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నుంచి బయలుదేరాల్సిన 155 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 102 ఇన్ బౌండ్ విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడిచాయి. రన్ వే పై నీరు నిలిచిపోవడం, వాతావరణం అనుకూలిచకపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నట్లు ఇండిగో సంస్థ ముందుగానే ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.

ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని BMC సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అలాగే పాల్ఘర్, థానే, రాయ్ గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ తో సహా మహారాష్ట్రలోని కొంకణ్ లో కాలేజీలకు సెలవు ఉన్నత విద్యాశాఖ డైరెక్టరేట్ సెలవు ప్రకటించింది.

మంగళవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా విఖ్రోలిలో 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బైకుల్లాలో 241.0 మి.మీ, శాంటాక్రూజ్ లో 238.2 మి.మీ, జుహులో 221.5 మి.మీ, బాంద్రాలో 211, కొలాబాలో 110.4, మహాలక్ష్మి ఏరియాలో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతె నమోదయింది.

Next Story