- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలకు కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు సమాధి?
దేశరాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ఈ భారీ వర్షానికి సౌత్ ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో భవనంలో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదుల్లాజాబ్ అనే ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి 7.44 గంటల సమయంలో భవనం కూలిపోయినట్లు అగ్నిమాపకశాఖకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు, పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదని పోలీసులు పేర్కొన్నారు. వైద్య బృందాలను స్పాట్ కు పిలిపించి.. గాయపడినవారికి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీ -ఎన్సీఆర్ కు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ
శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాతావరణం మారింది. భారీ వర్షం ముంచెత్తింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణశాఖ అంచనా ప్రకారం.. సెంట్రల్, ఈశాన్య, నైరుతి, పశ్చిమ, వాయువ్య ఢిల్లీ ప్రాంతాల్లో గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో, కొన్నిప్రాంతాల్లో గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీచాయి. దట్టమైన ధూళి, దుమ్ము రావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షాదరా, న్యూఢిల్లీ సహా ఆగ్నేయ, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లో కూడా గంటకు 40 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ, ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దారుణమైన వాతావరణ పరిస్థితుల మధ్యే సాకేత్‌లో భవనం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.






