- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy rain: ముంబైలో భారీ వర్షాలు.. 250 విమానాలపై ఎఫెక్ట్..!
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ (Kerala)ను తాకాయి. దీంతో, పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ (Kerala)ను తాకాయి. దీంతో, పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వయనాడ్ లో వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, కేరళలోని 11 రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో వైపు మహారాష్ట్రలోని ముంబైలోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.దీంతో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. భారీ వర్షాల కారణంగా సెంట్రల్, వెస్ట్రన్, హార్బర్ అనే మూడు ప్రధాన మార్గాల్లో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల వల్ల 250 విమానాలపై ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఇండియా సహా పలు ఎయిర్‌లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను పరిశీలించాలని సూచించాయి. దాదార్, మహిమ్, పరెల్, బాంద్రా, కాలాచౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
బీఎంసీ చర్యలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే థానే జిల్లా సహా ఇతర వర్ష ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షించారు. వరద పరిస్థితిని అంచనా వేయడానికి విపత్తు నిర్వహణ అధికారులతో చర్చలు జరిపారు. అంతేకాకుండా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా అధికారులతో చర్చలు జరిపారు. అవసరమైతే తప్ప తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ముంబై నివాసితులను కోరింది. అంతేకాకుండా, బీఎసీం, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) వర్షాకాలంలో ముంబైలో ప్రమాదకరమైనవిగా భావించే 96 భవనాలను గుర్తించాయి. దాదాపు 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాయి. ఇకపోతే, ఆదివారం నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రను తాకాయి. అయితే, గత 35 ఏళ్లలో తొలిసారిగా వారం ముందుగానే ముందుగానే రుతుపవానాలు మహారాష్ట్రను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది.
తమిళనాడులో వర్షాలు..
మరోవైపు, తమిళనాడులోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులోని ఊటీలో ఆదివారం ఒక బాలుడిపై చెట్టుపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా, కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి, ధార్వాడ్ జిల్లాల్లో సోమవారం భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, కర్ణాటకలో బెళగావి జిల్లాలో గోడకూలి నిద్రలోనే మూడేళ్ల బాలిక మృతి చెందింది. అంతేకాకుండా, ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్ పురాలు నీట మునిగాయి. విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది.






