హృదయవిదారక ఘటన.. కుక్క కాటుకు గురైన వృద్ధురాలు.. 20 కి.మీ నడిచి.. చివరకు!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

హృదయవిదారక ఘటన.. కుక్క కాటుకు గురైన వృద్ధురాలు.. 20 కి.మీ నడిచి.. చివరకు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలికి పెద్ద కష్టమే వచ్చింది. కానీ ఆమె ఏ మాత్రం దిగులు చెందకుండా తన ప్రయత్నంలో విజయం సాధించింది. అసలు విషయంలోకి వెళితే.. ఒడిశాలోని నువాపడ జిల్లాకు చెందిన వృద్ధురాలు మంగల్‌బారి మోహరా(92)ను కుక్క కరిచింది. కొద్ది రోజుల క్రితం ఆ వృద్ధురాలు కుక్క కాటుకు గురికాగా మొదటగా సీనపల్లిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.

ఇక డాక్టర్ల సూచన మేరకు రేబిస్‌ టీకా వేయించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ వృద్ధురాలు వెంటనే టీకా వేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. అటువైపుగా ఒక్క వాహనం కూడా రావడం లేదు. ఈ తరుణంలో చేసేదేమి లేక టీకా కోసం 20 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారు. అంటే.. గ్రామం నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న సీనాపల్లి వరకు కాలినడకన వెళ్లి.. మళ్లీ టీకా వేయించుకున్న తర్వాత మరో 10 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె చేస్తుండటంతో రవాణా సేవలు నిలిచిపోయాయి.

Next Story