- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హృదయ విదారక ఘటన.. కూతుళ్లతో కలిసి భర్తను దారుణంగా కొట్టిన తల్లి
కూతుళ్లతో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా కొట్టిన ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: కూతుళ్లతో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా కొట్టిన ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో జరిగింది. ప్రస్తుతం ఈ హృదయ విధారక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ (Video Vial) గా మారింది. ఘటన ప్రకారం మొరెనా (Morena) ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఓ రోజు ఆ మహిళ తన పిల్లలతో కలిసి మంచంపై పడుకున్న భర్తను కొట్టడం ప్రారంభించింది. ఆ వ్యక్తిని తన కూతుళ్లు (daughters) పట్టుకొని ఉండగా మహిళ (Women) కర్ర (stick) తో చితక బాదింది (Beat). మధ్యలో తన కుమారుడు (Son) ఆపే ప్రయత్నం చేసినా కూడా వినకుండా దారుణంగా (Brutally) కొట్టింది.
అంతేగాక ఈ విచారకర దృష్యాలను తన ఫోన్ లో చిత్రీకరించింది. కొద్ది రోజుల తర్వాత దెబ్బలు తిన్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు (Died). అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Police) విచారణ (Enquiery) చేపట్టారు. విచారణలో భాగంగా ఫోన్ చెక్ చేయగా భార్య బండారం బయటపడింది. అయితే ఆ వ్యక్తి కొట్టడం వల్ల చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కలియుగం అంటే ఇదేనేమో అని, రోజులు మారిపోయాయి అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.






