- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టులో అత్యవసర కేసుల విచారణ.. సీజేఐ సూర్యకాంత్ కీలక ప్రకటన
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court)లో అత్యవసర కేసుల విచారణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakant) కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court)లో అత్యవసర కేసుల విచారణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakant) కీలక ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ కేసుల విచారణకు డిసెంబర్ 22న ఒకటి లేదా రెండు బెంచ్‌లను అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. తాను కూడా ఆ రోజున అందుబాటులో ఉంటానని, ఇతర న్యాయమూర్తులపై అదనపు భారం పడకుండా చూస్తానని అన్నారు.
కాగా, ఈ నెల 22 నుంచి జనవరి 2, 2026 వరకు సుప్రీంకోర్టు వింటర్ వెకేషన్ (Winter Vacation) కొనసాగనుంది. ఈ క్రమంలోనే కోర్టు సాధారణ విచారణలు జరపకపోయినా బెయిల్, చైల్డ్ కస్టడీ, అరెస్ట్ నుంచి రక్షణ, హేబియస్ కార్పస్ వంటి అత్యవసర పిటిషన్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలించి, నిజంగా ఎమర్జెన్సీ ఉంటే డిసెంబర్ 22న లిస్ట్ చేయనుంది. సీజేఐ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీ బెంచ్ శుక్రవారం అత్యవసర ప్రస్తావనలు వింటూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక సుప్రీంకోర్టు సాధారణ విచారణలు 2026 జనవరి 5న తిరిగి ప్రారంభం కానున్నాయి.






