Murders: కేరళలో ఐదు దారుణ హత్యలు.. కేసులో బయటకొస్తున్న సంచలనాలు

by Shamantha N |

కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురం (Thiruvananthapuram)లో జరిగిన హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తన్నాయి.

Murders: కేరళలో ఐదు దారుణ హత్యలు.. కేసులో బయటకొస్తున్న సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురం (Thiruvananthapuram)లో జరిగిన హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తన్నాయి. వెంజరమూడు (Venzaramoodu)లో 23 ఏళ్ల అఫాన్ తన తల్లి, నానన్న, తమ్ముడు, లవర్ సహా ఆరుగురిని హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కాగా.. దర్యాప్తులో నిందితుడి తల్లి చనిపోలేదని.. ఆమె ప్రాణాలతో పోరాడుతోందని తేలింది. అఫాన్ తల్లికి క్యాన్సర్ బారిన పడిందని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అఫాన్ దారుణ హత్యలు చేయడానికి వెంజరమూడులోని మూడు ఇళ్లకు వెళ్లాడని, తరచుగా తన వాంగ్మూలాలను మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు. దుబాయ్ లో తన తండ్రి రూ.75 లక్షలు అప్పు చేశాడని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అఫాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే కుటుంబసభ్యులందరినీ హత్య చేసినట్లు పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ హత్యలకు అఫాన్ లవర్ కు సంబంధం ఏంటనేది తెలియాల్సి ఉందన్నారు. తన తండ్రి అప్పు విషయంలో తన ఇంట్లో గొడవ జరిగిందని, దానివల్ల ఎవరూ బతకకూడదని నిర్ణయించుకున్నట్లు అఫాన్ వాంగ్మూలం ఇచ్చాడు. సాయం కోసం ఎవరిని సంప్రదించినా సాయం చేయలేదన్నారు. తన తల్లి హారాన్ని దొంగిలించానని.. ఆ తర్వాత హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

అసలేం జరిగిందంటే?

అఫాన్‌ అనే వ్యక్తి వెంజరమూడులో తన తల్లి, సోదరుడి తో కలిసి ఉంటున్నాడు. ఆయన తండ్రి విదేశాల్లో స్పేర్‌ పార్ట్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. వెంజరమూడుకు 25 కిలోమీటర్ల దూరంలోని పాన్‌గోడ్‌ గ్రామంలో అతడి నానమ్మ నివసిస్తోంది. అయితే, తొలుత నానమ్మ ఇంటికి వెళ్లి ఆమె తలపై సుత్తితో కొట్టి చంపాడు. పాన్ గడ్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలోని తన బాబాయ్, పిన్ని ఇంటికి వెళ్లి వారిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపారు.. ఆ తర్వాత మార్గమధ్యలో తన గర్ల్‌ఫ్రెండ్‌ ను, స్కూల్‌ నుంచి 9వ తరగతి చదువుతున్న తన సోదరుడు తీసుకుని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే తల్లి, తమ్ముడు, లవర్ పై దాడి చేసి.. ఆ తర్వాత తాను విషయం తాగాడు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశానని వారికి తెలిపాడు. దాంతో పోలీసులు హుటాహుటిన మూడు ప్రదేశాల్లోకి వెళ్లారు. అఫాన్‌ నానమ్మ, బాబాయ్‌, పిన్ని, గర్ల్‌ ఫ్రెండ్‌, సోదరుడి మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టానికి పంపించారు. తీవ్రంగా గాయపడిన అఫాన్‌ తల్లిని, విషం సేవించిన అఫాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.

Next Story