PAK: జాఫర్ ఎక్స్ ప్రెస్‍పై దాడి మాపనే.. BLA సంచలన ప్రకటన.. పదే పదే ఈ ట్రైనే టార్గెట్ ఎందుకు?

by Prasad Jukanti |

పాకిస్తాన్‌లోని క్వెట్టాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై జరిగిన భారీ బాంబు పేలుడులో 24 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు.

PAK: జాఫర్ ఎక్స్ ప్రెస్‍పై దాడి మాపనే.. BLA సంచలన ప్రకటన.. పదే పదే  ఈ ట్రైనే  టార్గెట్ ఎందుకు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‍లో మరోసారి రైలుపై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. మారణహోమం సృష్టించిన ఈ దాడి తమ పనే అని బోలచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. పాక్ దళాల సిబ్బందిని తరలిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు బలోచ్ ఆర్మీ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు. పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తూ, తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని అందుకే ఈదాడికి పాల్పడినట్లు బీఎల్ఏ స్పష్టం చేసింది. అంతే కాదు అణచివేతకు గురై ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేడయానికి సిద్ధంగా ఉన్నారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

పదే పదే టార్గెట్ ఎందుకంటే?:

ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దాటుతుండగా పేలుడు పదార్థాలతో ఉన్న వాహననం రైలు బోగీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మృతులు ఎక్కువగా సైనికులే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై దాడి జరగడం ఇదేం కొత్త కాదు. ఈ రైలుకు ఉగ్రవాదులు, రెబల్స్ నుంచి కొన్నేళ్లుగా ముప్పు పొంచి ఉంది. దీనికి చాలా వ్యూహాత్మక కారణాలున్నాయి. పాకిస్తాన్ లోని క్వెట్టా నుంచి పెషావర్ కు ప్రయాణించే ఈ జాఫర్ ఎక్స్ ప్రెస్ కీలక పట్టణాల నుంచి ప్రయాణిస్తుంది. జకోబాబాద్, సుక్కూర్, రహీంయార్ ఖాన్, బహవల్పూర్, లాహోర్, గుజ్రాన్ వాలా, రావల్పండి మీదుగా పెషావర్ వెళ్తుంది. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను పాక్ ప్రభుత్వం తరలిస్తుంటుంది. అందువల్ల ఈ ట్రైన్‍ను టెర్రర్ గ్రూప్‍లు తమ హిట్ లిస్టులో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో 2018,2023, 2025 లో ఈ రైలుపై దాడులు, హైజాక్ ఘటనలు కలకలం రేపాయి. 2018 లో బలోచ్‌ రెబల్స్‌ రిమోట్ కంట్రోల్ తో దాడికి పాల్పడగా నాడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. 2023 జనవరిలో ఈ రైల్లో బాంబు పేలిన ఘటనలో 13 మంది ప్రాయాలు కోల్పోయారు. ఇక 2024లో క్వెట్టా స్టేషన్ లో పేలుడు జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

పునరుద్ధరించాక హైజాక్:

జాఫర్ ఎక్స్ ప్రెస్ ను నడపడం పాక్ ప్రభుత్వానికి తల ప్రాణం తోకలు చేరేలా పరిస్థితులు మారిపోయాయి. 2024 నవంబర్ లో క్వెట్టా స్టేషన్‍లో జరిగిన ఆత్మహుతి దాడిలో 60 మంది మరణించారు. దీంతో అప్పటి నుంచి ఈ ట్రైన్ ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని భావించుకున్నాక తిరిగి పునరుద్ధరించారు. అయితే సర్వీసు ప్రారంభించిన కొన్ని రోజులకే 2025 లో ట్రైన్ ను బీఎల్ఏ హైజాక్ చేసింది. ఈ ఘటనలో ఏకంగా 450 మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్న బీఎల్ఏ ఫైటర్లు 150 మంది పాక్ సైనికులను ఊచకోత కోసింది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన దాడికి తమదే బాధ్యత అని బీఎల్ఏ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story