- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హవాలా డబ్బు మాయం.. 11 మంది పోలీసులు సస్పెండ్
ఒక రాష్ట్రంలో పట్టుబడిన హవాల డబ్బును మరో రాష్ట్రానికి తరలించే క్రమంలో పోలీసులు చేతివాటం చూపించారు. మొత్తం డబ్బులో రూ. 1.45 కోట్ల హవాలా డబ్బును అధికారులే మాయం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఒక రాష్ట్రంలో పట్టుబడిన హవాలా డబ్బు (Hawala money)ను మరో రాష్ట్రానికి తరలించే క్రమంలో పోలీసులు చేతివాటం చూపించారు. మొత్తం డబ్బులో రూ. 1.45 కోట్ల హవాలా డబ్బును అధికారులే మాయం చేశారు. ఈ ఘటన జబల్పూర్ (Jabalpur)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన మవాలా డబ్బును మహారాష్ట్రకు పోలీసు అధికారులతో పంపించారు. అయితే మార్గ మద్యమంలో ఆ పోలీసులు రూ.1.45 కోట్ల హవాలా డబ్బును మాయం చేసి పంచుకున్నారు. అయితే హవాలా డబ్బులు సరెండర్ సమయంలో మొత్తం లెక్కల్లో తేడా రావడంతో.. పై అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. రూ.1.45 కోట్లను కేసులో 11 మంది పోలీసుల దోచుకొని పంచుకున్నారని తేల్చారు. అనంతరం ఆ 11 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు జబల్పూర్ ఐజీ ప్రమోద్ వర్మ (IG Pramod Verma) తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హవాలా డబ్బు మాయం చేసినందుకు 11 మంది పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక SIT బృందాన్ని ఏర్పాటు చేశారు."






