Trump: హెచ్1బీ వీసాలపై ట్రంప్ సంచలన కామెంట్స్

by Shamantha N |
Trump: హెచ్1బీ వీసాలపై ట్రంప్ సంచలన కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్1బీ (H1B Visa) వీసాల విస్తరణపై డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఇండో అమెరికన్ బిజినెస్ మ్యాన్ వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ అని అంటున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమర్థులైన వ్యక్తులు దేశంలోకి రావడాన్ని స్వాగతిస్తాన్ననారు. వైట్ హౌస్ లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఈ అంశంపై నాకు ఇరు వైపుల వాదనలు నచ్చాయి. సమర్థులు మన దేశంలోకి రావడాన్ని నేను ఇష్టపడతాను. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొనే ఈ మాట చెబుతున్నా. దేశ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది హెచ్‌1బీ వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను రెండు వాదనలనూ సమర్థిస్తున్నా’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. నిజంగా సమర్థులైన వ్యక్తులను, గొప్ప వ్యక్తులను అమెరికాలోకి వచ్చేందుకు అనుమతించాలన్నారు. హెచ్1బీ ప్రోగ్రాంతో తాము అదే చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed