- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Udhayanidhi: డీలిమిటేషన్ వేళ ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన (Delimitation) విషయంలో తమిళనాడు కేంద్రం విమర్శలు గుప్పిస్తోంది. డీలిమిటేషన్ వల్ల తమిళనాడులో లోక్ సభ స్థానాలు తగ్గుతాయని ఆ ప్రాంత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన (Delimitation) విషయంలో తమిళనాడు కేంద్రం విమర్శలు గుప్పిస్తోంది. డీలిమిటేషన్ వల్ల తమిళనాడులో లోక్ సభ స్థానాలు తగ్గుతాయని ఆ ప్రాంత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్థాలిన్(Udhayanidhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఉదయనిధి 72మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. అయితే ఎక్కువ మందిని మాత్రం కనొద్దని సూచించారు. ‘‘2026 తర్వాత అమల్లోకి వచ్చే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి రూపొందిస్తుంది. రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియలో ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జనాభా సంఖ్యను పర్యవేక్షిస్తోంది. తమిళనాడుతో సహా దక్షిణాది రాష్ట్రాలు చాలా ఏళ్లుగా జననాల రేటును నియంత్రిస్తూ వస్తున్నాయి. పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో దక్షణాది వాట తగ్గే ఛాన్స్ ఉంది’’ అని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.
39 నుంచి 31కి..
కాగా.. ప్రస్తుతం తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని ఉదయనిధి స్టాలిన్ గుర్తుచేశారు. తమిళనాడు జనాభా 7 కోట్లు కాబట్టి, డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే ఆ సంఖ్య 31కి తగ్గుతుందని చెప్పుకొచ్చారు. కాగా.. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం వందకు పైగా సీట్లు పొందుతారని అన్నారు. ఈ ప్రకారం రాష్ట్ర జనాభా కూడా అధికంగానే ఉండాలని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్ కొత్తగా పెళ్లయిన వారు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరడం గమనార్హం.






