MK Stalin: త్వరగా పిల్లల్ని కనండి.. కొత్త జంటలకు తమిళ సీఎం స్టాలిన్ సూచన

by S Gopi |

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే, తమిళనాట లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

MK Stalin: త్వరగా పిల్లల్ని కనండి.. కొత్త జంటలకు తమిళ సీఎం స్టాలిన్ సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కేంద్రం విమర్శలు పెంచారు. తాజాగా లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేందుకు తక్షణం పిల్లలను కనాలని కోరారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే, తమిళనాట లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా నష్టపోకూడదంటే కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు వెంటనే పిల్లలను కనాలని అన్నారు. గతంలో తానే కొత్త జంటలు పిల్లలను కనేందుకు సమయం తీసుకోవాలని చెప్పాను. కానీ, ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నియోజనకవర్గాలను పునర్విభజించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పిల్లలను కనాలని కోరుతున్నాను. మనం జనాభా పెంచుకోకపోతే నష్టపోతాం. అందుకే కొత్తగా పెళ్లయిన వారంతా వెంటనే పిల్లల్ని కనండి. వారికి తమిళ పేర్లు పెట్టాలని కోరారు. మరోవైపు, ఇదే అంశంపై చర్చ కోసం ఎంకె స్టాలిన్ మార్చి 5న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని రాష్ట్రంలో ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న 40కి పైగా పార్టీలకు ఆహ్వానం పంపారు.

Next Story