- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hate speech: ద్వేష పూరిత ప్రసంగం.. ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష
ద్వేష పూరిత ప్రసంగం కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ కుమారుడు, మౌ సదర్ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: ద్వేష పూరిత ప్రసంగం కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ కుమారుడు, మౌ సదర్ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. 2022లో జరిగిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. దీంతో అబ్బాస్ తన శాసనసభ సభ్యత్వాన్ని కూడా కోల్పోనున్నారు. ఈ కేసులో అబ్బాస్ అన్సారీ సోదరుడు మన్సార్ అన్సారీ కూడా దోషిగా తేలగా ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. కాగా, 2022లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్సారీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ద్వేషపూరిత ప్రసంగం చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల సంగతి చూసుకుంటానని వ్యాఖ్యానించారు. దీంతో అబ్సాస్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.






