- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haryana: పోలీసుల కంటే దొంగలు ఎక్కువ కోఆపరేటివ్‌గా ఉన్నారు.. హర్యానా మహిళ పోస్టు వైరల్
తన ఫోన్ పోగొట్టుకున్న హర్యానాకు చెందని ఓ మహిళ పోలీసులకు ఉద్దేశించి లింక్ డిన్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: తన ఫోన్ పోగొట్టుకున్న హర్యానా (Haryana)కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఉద్దేశించి లింక్ డిన్ (Linkdin)లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లే హర్యానాకు చెందిన హిమాన్షి గబా అనే మహిళ ఇటీవల తన ఫోన్ పోగొట్టుకుంది. ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. కానీ పోలీసులు పలు ప్రశ్నలు వేసి ఆమెకు చిరాకు తెప్పించారు. చోరీపై దర్యాప్తు చేయడానికి బదులుగా ఆమెను వింత ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. దీంతో ఈ ఘటనను ఉద్దేశిస్తూ ఆమె పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన హర్యానా పోలీసులారా.. దొంగలు మీకంటే ఎక్కువ సహకరిస్తారు. నా ఫోన్ చోరీకి గురైంది. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఫిర్యాదు తీసుకోకుండా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు’ అని పేర్కొన్నారు.
అయితే ఫోన్ దొంగిలించిన వ్యక్తే మాకు సహకరించాడని, డబ్బులు తీసుకుని నా ఫోన్ తిరిగి ఇచ్చాడని వెల్లడించారు. దొంగకు, మాకు మధ్య చాలా సజావుగా సమన్వయం జరిగిందని చివరకు ఫోన్‌ను తిరిగి పొందామని తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పలువురు నెటిజన్లు తమ అనుభవాలను సైతం కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ‘హైదరాబాద్‌లో నా ఫోన్ పోయినప్పుడు కూడా నాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వారు నా ఫిర్యాదును నమోదు చేశారు. కానీ పట్టించుకోలేదు. వీఐపీ కాకపోతే పోలీసులు పట్టించుకోరు’ అని ఓ వినియోగదారుడు తెలిపారు.






