Farmers: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం

by S Gopi |

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులు ప్రస్తుతానికి చలో ఢిల్లీ పాదయాత్రను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

Farmers: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంటలకు కనీస మద్దతు ధరతో పాటు 12 కీలక డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాల నేతలు చేపట్టిన చలో ఢిల్లీ పాదయాత్రను ఆపేశారు. హర్యానా, పంజాబ్‌కు మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద ఆదివారం పోలీసులు మరోసారి బాష్పవాయువు ప్రయోగించడంతో కొందరు రైతులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతులు ప్రస్తుతానికి చలో ఢిల్లీ పాదయాత్రను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ఆధ్వర్యంలో 101 మందితో కూడిన రైతుల బృందం శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ ఢిల్లీకి మార్చ్ చేసేందుకు రైతులు మొదటిసారి ప్రయత్నం చేసినప్పటికీ, అది విఫలమైంది. ఆదివారం మళ్లీ పాదయాత్రను మొదలుపెట్టారు. కొన్ని మీటర్ల వరకు నడిచిన తర్వాత వారిని హర్యానా పోలీసులు భారీ బారికేడ్‌లతో అడ్డుకున్నారు. ఢిల్లీకి పాదయాత్ర చేయడానికి అనుమతి చూపించాలని పోలీసులు కోరారు. పరిస్థితి కాస్త ఇరువర్గాల మధ్య తోపులాటగా మారింది. అనంతరం రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు గాయపడగా, రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తమతో చర్చలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story