- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haryana: రూ. 20 కోట్ల అప్పు.. ఏడు నిండు ప్రాణాలు బలి
హర్యానాలోని పంచుకులలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 7 గురు కారులో సూసైడ్ చేసుకుని చనిపోయారు. వీరందరూ విషం తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని పంచుకులలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 7 గురు కారులో సూసైడ్ చేసుకుని చనిపోయారు. వీరందరూ విషం తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రవీణ్ మిట్టల్ (Praveen Mittal)అనే వ్యాపారి హిమచల్ ప్రదేశ్ లో స్క్రాప్ ఫ్యాక్టరీ పెట్టాడు. దాని రుణం తీర్చలేకపోగా అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. దీంతో పాటు ఇల్లు, స్థలాలు కూడా సీజ్ చేయడంలో హర్యానా నుంచి ప్రవీణ్ మిట్టల్ వేరే చోటుకు మకాం మార్చాడు. మిట్టల్ సొంత పట్టణం హిసార్‌లోని బర్వాలా. కాగా పంచకులలో వీరు నివసిస్తున్నారు. కుటుంబంతో పాటు భాగేశ్వర దామ్ లో ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ముందుగా కుటుంబ సభ్యులకు విషమిచ్చి వారంతా చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ప్రవీణ్ మిట్టల్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు వచ్చే లోపు ప్రవీణ్ మిట్టల్ కూడా చనిపోయాడు
ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొని..
బాగేశ్వర దామ్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం అయిపోయిన తర్వాత కారుతో రోడ్డుపై కూర్చున్నాడు. పక్కన ఉన్న స్థానికుడు అక్కడి నుంచి కారు తీసేయాలని కోరగా.. రూం దొరకలేదు అందుకే ఇక్కడ కూర్చున్నాను తీసేస్తానని చెప్పాడు. అలా కారు తీసి వెళుతుండగా కారులో అందరూ పడిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే కారును ఆపి చూడగా అప్పటికే ఆరుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. “వారందరూ చనిపోయారు. నేను కూడా అయిదు నిమిషాల్లో చనిపోతాను” అని ప్రవీణ్ మిట్టల్ తెలిపడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న హర్యానా డీజీపీ కారులో సూసైడ్ నోట్ దొరికిందని వ్యాపారంలో నష్టం రావడంతోనే అందరం సూసైడ్ చేసుకుంటున్నట్లు అందులో ఉందని పేర్కొన్నారు. డెడ్ బాడీలను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రవీణ్ మిట్టల్ కుటుంబంలో ఆయన తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది.






