- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Haryana: కాపురంలో సోషల్ మీడియా చిచ్చు.. భర్తను చంపిన మహిళ

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాకు చెందిన దంపతుల కాపురంలో సోషల్ మీడియా చిచ్చు పెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమాయణం సాగించిన మహిళ.. చున్నీతో భర్తకు ఉరి బిగించి చంపింది. ఆ తర్వాత డెడ్ బాడీని డ్రైనేజీలో పడేసి ఏమీ ఎరుగనట్టు నటించింది. హర్యానాలోని భివానీలో జరిగిన ఈ ఘటన జరిగింది. భివానీకి చెందిన ప్రవీణ్‌తో రవీనాకు 2017లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ముకుల్ అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, రవీనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక యూట్యూబ్ రన్ చేస్తూ అందులో వీడియోలు షేర్ చేస్తుంది. ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఆప్‌లోడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం యూట్యూబర్ సురేష్‌తో రవీనాకు పరిచయం ఏర్పడింది. దీంతో, వారిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత, ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ కలిసి రీల్స్ కూడా చేశారు. ఇలా రెండేళ్ల పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు మరింత దగ్గరయ్యారు. రవీనా సురేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం రవీనా భర్త ప్రవీణ్‌కు వీరి వ్యవహారం తెలిసింది. రవీనాకు గట్టిగానే హెచ్చరించాడు. ఈ క్రమంలో మార్చి 25వ తేదీన రవీనా ఇంటికి సురేష్ వచ్చాడు.. ఇదే సమయంలో ప్రవీణ్ ఇంటికి రావడంతో వారిద్దరూ దొరికిపోయారు. తర్వాత, వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, రవీనా, సురేష్ కలిసి.. ప్రవీణ్ హత్య చేశారు. అనంతరం, ప్రవీణ్ మృతదేహాన్ని తన బైక్‌పై తీసుకెళ్లి.. దూరంగా ఉన్న మురుగు కాలువలో పడేశారు. తర్వాత ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో..
ఆ తర్వాత ప్రవీణ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసకున్న పోలీసులు.. వారి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో, రవీనాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. దీంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు సురేష్‌తో కలిసి ప్రవీణ్‌ను హత్య చేసినట్టు ఒప్పుకుంది. ప్రస్తుతం సురేష్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.