- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్ జీవితాన్నే మార్చేసిన లాటరీ.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు
పక్కనోడు ఎదుగుతున్నాడంటే ఎలా తొక్కేద్దామా అని ఆలోచించే రోజుల్లో.. తమలో ఒకడికి అదృష్టం లాటరీ రూపంలో కలిసొచ్చిందని తెలిసి ఆ ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పక్కనోడు ఎదుగుతున్నాడంటే ఎలా తొక్కేద్దామా అని ఆలోచించే రోజుల్లో.. తమలో ఒకడికి అదృష్టం లాటరీ రూపంలో కలిసొచ్చిందని తెలిసి ఆ ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. ఇంటిల్లిపాది కష్టపడితే కానీ రెండుపూటలా భోజనం చేయడం కష్టంగా ఉండే వారి జీవితాల్లో లాటరీ టికెట్ వెలుగులు నింపింది. హర్యానా రాష్ట్రంలోని సిర్సా జిల్లా మహమ్మద్ పురియాకు చెందిన పృథ్వీసింగ్ (35) వృత్తిరీత్యా డ్రైవర్. భార్య, ఇద్దరు పిల్లలు, తండ్రి, సోదరుడు ఉన్నారు. అతని భార్య సుమన్ రాణి స్థానికంగా ఉన్న ఒక స్కూల్లో ప్యూన్ గా పనిచేస్తోంది. తండ్రి దేవీలాల్ కూడా డ్రైవరే.
వీరంతా కష్టపడితేనే ఆ పిల్లలకు చదువు, వారి కడుపు నింపుకునేందుకు కాసింత భోజనం దొరుకుతుంది. అలాంటి పృథ్వీసింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించాడు. ముచ్చటగా మూడో ప్రయత్నంలోనే రూ.10 కోట్ల బహుమతి వచ్చింది. లోహ్రీ మకర సంక్రాంతి 2026 బంపర్ లాటరీలో మొదటి బహుమతిగా తనకు రూ.10 కోట్లు రావడంతో పృథ్వీ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఈ నగదును తన పిల్లల భవిష్యత్ కోసం వాడుతానని తెలిపాడు. అతని ఆరేళ్ల కొడుకు దక్ష్.. తాము ఒక లగ్జరీ కారును కొనాలనుకుంటున్నట్లు చెప్పాడు.






