- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haryana CM Nayab Singh : యమునా నది నీళ్లను తాగిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గందరగోళం రేపేందుకు ఢిల్లీకి సరఫరా జరిగే యమునా నది నీటి(Yamuna River Water)లో హర్యానా బీజేపీ ప్రభుత్వం (Haryam BJP Government) విషం కలిపింద(Poisoned)న్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపణలను ఖండించిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని(Haryana CM Nayab Singh Saini) బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని సేవించి..అక్కడే అధికారులతో సమీక్ష చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గందరగోళం రేపేందుకు ఢిల్లీకి సరఫరా జరిగే యమునా నది నీటి(Yamuna River Water)లో హర్యానా బీజేపీ ప్రభుత్వం (Haryam BJP Government) విషం కలిపింద(Poisoned)న్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపణలను ఖండించిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని(Haryana CM Nayab Singh Saini) బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని సేవించి..అక్కడే అధికారులతో సమీక్ష చేశారు. నదిలోకి దిగిన సీఎం నాయబ్ సింగ్ సైని నీళ్లు తాగి నెత్తిన(Takes A Sip Of Water From The Yamuna River) చల్లుకున్నారు .
అటు హర్యానా ప్రభుత్వం కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ (Vipul Goyal) పేర్కొన్నారు. యమునా (Yamuna) నదిని బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందని కేజ్రీవాల్ చేసిన అసత్య ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కేజ్రివాల్ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము ఊరికే విడిచిపెట్టబోమని... దీనిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని.. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్ ఆరోపణలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ తాగే నీళ్లలో హర్యానా బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా అటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో కూడా ఉన్నారని..తమ సొంత ప్రజలు తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా అని..ఆ నీటిని తాగే వారిలో ప్రధాని కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఆప్ పాలకులు నిందారోపణలతో ఏవగించే ఆరోపణలకు పాల్పడుతున్నారని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు.
కాగా ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆప్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు యమునా నదిలోకి కావాలనే బీజేపీ హర్యానా పాలకులు పారిశ్రామిక వ్యర్ధాలను వదులుతోందని కేజ్రీవాల్ రెండు రోజుల క్రితం ఆరోపించారు. నదిలో విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్ధాలను డంప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi) విలేకరులతో మాట్లాడుతూ. యమునను కలుషితం చేయడం 'జల ఉగ్రవాదం' అని అభివర్ణించారు. హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కేజీవాల్ చేసిన ఆరోపణలను దిల్లీ జల్ బోర్డు కొట్టిపడేసింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని.. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఢిల్లీ జల్ బోర్డు స్పష్టం చేసింది.






