ఢిల్లీలో సుప్రీం లాయర్‌తో హ‌రీష్ రావు భేటీ

by velandi.Saikiran |

జ‌గిత్యాల స‌భ‌కు కేసీఆర్ వెళితే, హ‌రీష్ రావు మాత్రం ఢిల్లీకి వెళ్లారు.

ఢిల్లీలో సుప్రీం లాయర్‌తో హ‌రీష్ రావు భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌గిత్యాల స‌భ‌కు కేసీఆర్ వెళితే, హ‌రీష్ రావు మాత్రం ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు హుటాహుటిన వెళ్లారు. ఈ తరుణంలోనే ఢిల్లీలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో బీఆర్ఎస్ త్రిసభ్య బృందం సమావేశమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లి ఆయనను మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కలిశారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. కాళేశ్వరం కమిషన్‌పై త్వరలో రానున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సీనియర్ లాయర్ ఆర్యమా సుందరంతో సుదీర్ఘంగా చర్చించారు బీఆర్ఎస్ సభ్యులు.

Next Story