- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"నా కూతురు పాక్‌కు వెళ్తుందని తెలీదు" : జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్
ఈ విషయంపై జ్యోతి తల్లిదండ్రుల మాట మరోలా ఉంది. ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాకు ఆమె పాకిస్తాన్ కు వెళ్లి వస్తుందన్న విషయమే తెలియదని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి వెనుక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti malhotra) పాత్ర ఉందని తెలుస్తోంది. పాక్ కు గూఢచర్యం వహించిన కారణంగా మూడురోజుల క్రితం ఆమెతో పాటు మరికొందరిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్రావెల్ విత్ జో (Travel with Jyo) యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోన్న జ్యోతి.. ట్రావెల్ వీసాపై పాక్ కు వెళ్లి వచ్చిందని, అక్కడి అధికారులతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని విచారణలో తేలింది. అయితే ఈ విషయంపై జ్యోతి తల్లిదండ్రుల మాట మరోలా ఉంది. ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాకు ఆమె పాకిస్తాన్ కు వెళ్లి వస్తుందన్న విషయమే తెలియదని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లి వీడియోలు తీసుకుంటుందని తెలుసన్నారు.
అయితే.. పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తాజా దర్యా్ప్తులో తేలింది. ఉగ్రదాడికి మూడునెలల ముందు ఆ ప్రాంతానికి వెళ్లిన జ్యోతి.. అక్కడ వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ (Pak ISI)తో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి క్లోజ్ సంబంధాలున్నాయని వెల్లడైనట్లు సమాచారం. పహల్గామ్ దాడి తర్వాత లైవ్ కి వచ్చిన జ్యోతి.. ఇది చాలా బాధాకరమైన ఘటన అని చెప్పడంలో ఎలాంటి బాధ కనిపించకపోవడం గమనార్హం.






