- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hanuman: హనుమంతుడే తొలి వ్యోమగామి.. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ హనుమంతుడిని తొలి వ్యోమగామిగా అభివర్ణించారు. అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు ఆయనే అయి ఉంటారన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag takur) హనుమంతుడిని తొలి వ్యోమగామిగా అభివర్ణించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి యాత్రికుడు ఆయనే అయి ఉంటారని వ్యాఖ్యానించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో జరిగిన ఓ పాఠశాలలో అనురాగ్ ఠాకూర్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంతరిక్షంలోకి మొదట ప్రయాణించిన వ్యక్తి ఎవరు అని ఆయన పిల్లలను అడిగారు? దీనికి పిల్లలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని సమాధానం ఇవ్వగా దానికి అనురాగ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత వరకు మొదటి వ్యోమగామి హనుమాన్ అయ్యి ఉండొచ్చని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికీ వర్తమానంలోనే మనల్ని మనం చూసుకుంటున్నామని చెప్పారు. నేటికీ మనం చూస్తున్న జ్ఞానం బ్రిటిష్ వారు అందించిందేనని, కానీ మన గ్రంథాలలో ఇంకా లోతైన జ్ఞానం దాగి ఉందని తెలిపారు. వేదాలు, పురాణాల వైపు విద్యార్థులను తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






