- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. హర్యానాలో 23వ జిల్లాగా 'హాన్సీ'
హర్యానా రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 22 నుంచి 23 కు పెంచుతూ, హాన్సీని నూతన జిల్లాగా ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: హర్యానా రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 22 నుంచి 23 కు పెంచుతూ, హాన్సీని నూతన జిల్లాగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 22, 2025) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో హిసార్ జిల్లాలో భాగంగా ఉన్న హాన్సీని, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక జిల్లాగా మారుస్తూ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త జిల్లాలో హాన్సీ, నార్నౌండ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 110 గ్రామాలు చేర్చబడ్డాయి. దాదాపు 5.41 లక్షల జనాభా కలిగిన ఈ జిల్లాలో రెండు సబ్ డివిజన్లు, మూడు తహసీల్దార్ కార్యాలయాలు, ఒక సబ్-తహసీల్ ఉండనున్నాయి. 2016లో చర్ఖీ దాద్రిని 22వ జిల్లాగా ప్రకటించిన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత హాన్సీకి ఈ హోదా లభించింది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర సేవలు వేగవంతం కానున్నాయని ప్రభుత్వం పేర్కొంది.






