- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hanif Abbasi: భారత్ యుద్ధానికి సిద్ధం కావాలి.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahalgam Terror Attack) నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ (Pakistan) పట్ల భారత్ (India) దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahalgam Terror Attack) నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ (Pakistan) పట్ల భారత్ (India) దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాక్ రైల్వే మినిస్టర్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నాయకుడు హనీఫ్ అబ్బాసి (Hanif Abbasi) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశంపై భారత్ (India) న్యూక్లియర్ వెపన్స్ (Nuclear Weapons)తో దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సింధు జలాల (Indus Water) ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే.. అందుకు డైరెక్ట్‌గా యుద్ధానికే సిద్ధం కావాలంటూ వార్నింగ్ ఇచ్చాడు.
తమ వద్ద కూడా న్యూక్లియర్ బాంబ్స్ (Nuclear Bombs) ఉన్నాయని.. ఇప్పటికే వాటిని టార్గెట్ చేసి సిద్ధం చేసి ఉంచామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ అమ్ములపొదిలో ఘోరీ (Ghori), షాహీన్ (Shaheen), ఘజ్నవి (Ghaznavi) లాంటి క్షిపణులతో పాటు మొత్తం 130 న్యూక్లియర్ వెపన్స్ (Nuclear Bombs) ఇండియా కోసం సిద్ధం చేసి ఉంచామని కామెంట్ చేశారు. దౌత్యపరమైన చర్చలతో ఇరు దేశాల సరిహద్దులను రక్షించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నా.. పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahalgam Terror Attack) తమపై తోస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారని హనీఫ్ అబ్బాసీ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.






