- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meghalaya honeymoon murder : మా చెల్లిని ఉరి తీయండి : సోనమ్ సోదరుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(HoneyMoon Murder Case)లో నిందితురాలు సోనమ్(Sonam) నేడు సిట్ ముందు తన నేరం ఒప్పుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(HoneyMoon Murder Case)లో నిందితురాలు సోనమ్(Sonam) నేడు సిట్ ముందు తన నేరం ఒప్పుకున్న విషయం తెలిసిందే. తన భర్తను తనే ప్లాన్ చేసి హత్య చేయించినట్లు అంగీకరించింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ సోదరుడు గోవింద్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. పోలీసుల విచారణలో వెల్లడైన సాక్ష్యాలను బట్టి చూస్తే సోనమ్ తప్పు చేసిందని అన్నాడు. పూర్తి విచారణలో నేరం చేసినట్టు తేలితే ఆమెను ఉరి తీయండని పోలీసులకు విన్నవించాడు.
రాజా రఘువంశీ కుటుంబీకులకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపిన గోవింద్.. వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని ప్రకటించాడు. న్యాయ పోరాటంలో వారికి తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని అన్నాడు. సిట్ ముందు తన నేరాన్ని ఒప్పుకున్న సోనమ్ సహ 8 మంది నిందితులను కస్టడీకి అప్పగిస్తూ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.






