Israel : హమాస్ చీఫ్ హతం : ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన

by Muthe.Rajitha |   (  Updated:2025-05-28 15:43:06  IST  )

హమాస్ చీఫ్(Hamas Cheif) హతం అయినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు(Israel PM Benjamin Netanyahu) సంచలన ప్రకట చేశారు.

Israel : హమాస్ చీఫ్ హతం : ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : హమాస్ చీఫ్(Hamas Cheif) హతం అయినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు(Israel PM Benjamin Netanyahu) సంచలన ప్రకట చేశారు. నేడు జరుసలేమ్‌లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నెతాన్యాహు మాట్లాడుతూ.. హమాస్ నాయకుడు మహ్మద్ సిన్వర్(Mohammed Sinwar) హతమైనట్లు వెల్లడించారు. "మేము డీఫ్, హనీయెహ్, యాహ్యా సిన్వర్ వంటి హమాస్ నాయకులను హతం చేశాం, ఇప్పుడు మహ్మద్ సిన్వర్‌ను కూడా హతం చేశాం" అని చెప్పారు. మహ్మద్ సిన్వర్, గాజా స్ట్రిప్‌(Gaza Strip)లో హమాస్ నాయకుడిగా ఉన్నాడు. అతని సోదరుడు యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు 2024 అక్టోబర్‌లో హతం చేసిన తర్వాత ఆయన ఈ పదవిని చేపట్టాడు.

ఇజ్రాయెల్ సైన్యం మే 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సమీపంలోని యూరోపియన్ హాస్పిటల్ కింద ఉన్న ఒక భూగర్భ కమాండ్ కాంపౌండ్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిలోనే మహ్మద్ సిన్వర్, అలాగే హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా హతమైనట్లు నివేదికలు వచ్చాయి. ఈ హత్యలు హమాస్ నాయకత్వానికి పెద్ద దెబ్బ అయినప్పటికీ.. హమాస్ ఇంకా గాజాపై పట్టు కోల్పోలేదని, మహ్మద్ సిన్వర్ మరణం తర్వాత కూడా హమాస్ నాయకత్వం ఖతార్‌లోని రాజకీయ విభాగం ద్వారా నడుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే నెతాన్యాహు మాత్రం గాజా పూర్తిగా ఇజ్రాయెల్ నియంత్రణలోకి వస్తుందని, గాజా నుంచి పాలస్తీనియన్లను ఖాళీ చేయిస్తామని చెబుతున్నారు. మరో 20 మంది బందీలు ఇంకా గాజాలో ఉన్నారని, వారిని విడిపించే వరకు యుద్ధం ఆగదని నేతాన్యాహు స్పష్టం చేశారు.

Next Story