- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్ సీజ్‌ఫైర్ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం!
by Phanindra |
యూఎస్ సీజ్‌ఫైర్ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను వదిలేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన గాజా సీజ్‌ఫైర్ ఒప్పందానికి హమాస్ అంగీకరించింది. దీంతో ఇజ్రాయెల్‌తో యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉందని పాలస్తీనా అధికారులు భావిస్తున్నారు. మధ్యవర్తులు ప్రతిపాదించిన ఏడుగురు బందీల విడుదల, 70 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు కూడా కొంత వరకు వెనక్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ బంధించిన కొందరు పాలస్తీనియన్లను కూడా విడుదల చేస్తారట. అయితే ఈ ప్రతిపాదన గురించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story






