'Man-Eater' Tiger: పులి కడుపులో వెంట్రుకలు, చెవిరింగులు, దుస్తులు..!

by Shamantha N |

కేరళలోని(Kerala) వయనాడ్‌ జిల్లాలో చనిపోయిన పులికి పోస్టుమార్టం నిర్వహించగా.. సంచలనాలు బయటపడ్డాయి. ‘మ్యాన్‌ ఈటర్‌’గా('Man-Eater' Tiger) ప్రకటించిన పులి ఇటీవలే చనిపోయింది.

Man-Eater Tiger: పులి కడుపులో వెంట్రుకలు, చెవిరింగులు, దుస్తులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని(Kerala) వయనాడ్‌ జిల్లాలో చనిపోయిన పులికి పోస్టుమార్టం నిర్వహించగా.. సంచలనాలు బయటపడ్డాయి. ‘మ్యాన్‌ ఈటర్‌’గా('Man-Eater' Tiger) ప్రకటించిన పులి ఇటీవలే చనిపోయింది. అయితే, పోస్టుమార్టం తర్వాత పులి కడుపులో వెంట్రుకలు, చెవిరింగులు, బాధితురాలి దుస్తులు లభ్యమయ్యాయి. ఇవన్నీ పులిదాడిలో చనిపోయిన మహిళవేనని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పులికోసం అటవీశాఖ సిబ్బంది గాలిస్తున్నాయి. అయితే, సోమవారం ఉదయం పులిజాడలు గుర్తించారు. కాగా.. పిలకావు దగ్గరలోని పాడుబడిన నివాసంలో పులి కళేబరాన్ని కనుగొన్నారు. పులి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మరో క్రూరమృగం చేసిన దాడిలో మరణించి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించగా ఇవన్నీ లభ్యమయ్యాయి.

మహిళపై దాడి చేసిన పులి

వయనాడ్‌లోని మనంతవాడి దగ్గర కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45)పై ఇటీవల పులి దాడి చేసింది. ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసింది. ఆ తర్వాత అటవీశాఖ అధికారిపైనా దాడికి పాల్పడింది. ఇలా పులి వరుస దాడులకు పాల్పడుతుండటం, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలోనే టైగర్ ని ‘మ్యాన్‌ ఈటర్‌’గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కనిపిస్తే చంపేయాలని ఆదేశించింది. కాగా.. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పులి కళేబరం కన్పించింది..

Next Story