- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సోషల్ మీడియా కంటెంట్‌ను షేర్ చేసినందుకు సుప్రీంకోర్టు మంగళవారం కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయపై తీవ్రంగా మండిపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన అభ్యంతరకరమైన సోషల్ మీడియా కంటెంట్‌ను షేర్ చేసినందుకు సుప్రీంకోర్టు మంగళవారం కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయపై తీవ్రంగా మండిపడింది. అయితే, అరెస్టు నుండి అతనికి మధ్యంతర రక్షణ కల్పించింది. అయితే, హేమంత్ మాలవీయ అభ్యంతరకరమైన పోస్ట్‌లను షేర్ చేయడం కొనసాగిస్తే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛను తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని హేమంత్ మాలవీయకు ధర్మాసనం హెచ్చరించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు ఆర్టిస్టులు, యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు ఇష్టం వచ్చిన రీతిలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని అభిప్రాయపడింది. వాటిని నిలువరించేందుకు అవసరమైన తప్పనిసరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ సుధాంషు ధులియా, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఇది ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఎలాంటి భాషలో అనేదానితో సంబంధం లేకుండా ఏం చేసినా, ఏం రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారు. ఇది ఆందోళన కలిగించే విషామని పేర్కొంది. ఇలాంటి ఘటనలు తరచుగా తమ దృష్టికి రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగస్టు 15 తర్వాత ఈ విషయంపై తదుపరి విచారణలో దుర్వినియోగమవుతున్న సోషల్ మీడియా పోస్ట్‌లను ఎలా ఎదుర్కోవాలో ఆదేశాలను జారీ చేయడంపై సంకేతాలిచ్చింది. కాగా, ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్‌పై అభ్యంతరకర కార్టూన్లపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త వినయ్ జోషి ఫిర్యాదు చేశారు. హేమంత్ మాలవీయ పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. తనను అరెస్ట్ చేయొద్దంటూ హేమంత్ మాలవీయ వేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్ కోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.






