హెచ్-1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు.. టెక్ సంస్థలపై తీవ్ర ప్రభావం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-20 03:18:49  IST  )

హెచ్-1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

హెచ్-1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు.. టెక్ సంస్థలపై తీవ్ర ప్రభావం
X

దిశ, వెబ్‌డెస్క్: హెచ్-1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామంతో భారతీయులతో పాటు పలు టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. హెచ్‌-1బీ వీసా లబ్ధిదారులలో 70 శాతం మంది భారతీయులే ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ట్రంప్ 10 లక్షల డాలర్లతో గోల్డ్ కార్డును ప్రకటించాడు. ఆ కార్డులతో అమెరికాకు సుమారు 100 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుంది. వచ్చిన సొమ్ముతో పన్నుల తగ్గింపు, ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులను వినియోగించనున్నారు.

టెక్ సంస్థలపై బిగ్ ఇంపాక్ట్..

హెచ్-1B ఫీజు పెంపు నిర్ణయంతో భారతాయ వృత్తి నిపుణలు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లింపునకు కంపెనీలు సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. హెచ్-1B రుసుమును ఏటా వాసూలు చేస్తామని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ కూడా స్పష్టం చేశారు. గ్రీన్ కార్డు లేకపోతే ఉద్యోగాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. మరోవైపు అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే భారతీయ విద్యార్థులపై ప్రభావం పడనుంది. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం అత్యధికంగా హెచ్-1B వీసాలు పొందిన దేశంగా భారత్ ఉండగా.. 11.7 శాతంతో రెండో స్థానంలో చైనా ఉంది.

హెచ్-1B వీసాపై లక్షలాది టెకీలు..

హెచ్‌-1Bపై లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ నుంచి లక్ష 48 వేల మంది ఉద్యోగులు, టీసీఎస్ నుంచి లక్ష 20 వేల మంది, విప్రో నుంచి 60 వేల మంది, HCL నుంచి 57 మంది, టెక్ మహీంద్ర నుంచి 22 వేల మంది ఉద్యోగులు అమెరికాలో హెచ్-1Bపై విధులు నిర్వర్తిస్తున్నారు

Next Story