- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ నకు ఎదురుదెబ్బ.. H-1B వీసాలపై కీలక తీర్పు
డోనాల్డ్ ట్రంప్ నకు ఎదురుదెబ్బ తగిలింది. H-1B వీసాలపై కీలక తీర్పు వెలువడింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు ఎదురుదెబ్బ తగిలింది. H-1B వీసాలపై కీలక తీర్పు వెలువడింది. విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కొత్త H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది. ఇది చట్ట విరుద్ధమైన ఫీజు అంటూ వ్యాఖ్యానించింది. దీనిని US కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఆమోదించలేదని, బోస్టన్ లోని డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఫీజులు సవాలు చేస్తూ 20 మంది అటార్నీ జనరల్ దాఖలు చేసిన పిటిషన్ పై సోరోకిన్ తాజాగా తీర్పు చెప్పారు. దీంతో ట్రంప్ నకు నిరాశ ఎదురయింది. కాగా గతంలో ట్రంప్ సర్కార్ ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసాల దరఖాస్తులు భారీగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. పాత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా H-1B ప్రోగ్రాం ప్రతి ఏడాది సుమారు 65 వేల వీసాలను అందిస్తోంది. అదనంగా ఉన్నత విద్యార్హతలు ఉన్నవాళ్లకు మరో 20 వేల వీసాలు లభిస్తున్నాయి. అయితే ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2000 డాలర్ల నుంచి 5వేల డాలర్ల వరకు ఉండేది. కానీ కొత్తగా ప్రతిపాదించిన 1,00,000 ఫీజు కంపెనీలకు తీవ్రంగా భారం కానుంది. అయితే ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలో కొంతమంది సమర్థిస్తున్నారు. అమెరికా ఉద్యోగాలను రక్షించడం కోసం ఇలాంటి చర్యలు తప్పవని చెబుతున్నారు. విదేశీ ఉద్యోగులు తక్కువ ఫీజులతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ వీటిని కోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.






